IRDAI: Flipkart కు రూ.1.06 కోట్ల జరిమానా 10 d ago

ఇ-కామర్స్ సంస్థ Flipkart కు భారీ జరిమానా పడింది. ఆన్ లైన్ బీమా పంపిణీలో నిబంధనల ఉల్లంఘనకు గాను బీమా రెగ్యులేటరీ IRDAI రూ.1.06 కోట్ల ఫైన్ వేసింది. Flipkart తన ఖాతాదారులను బీమా సంస్థ వెబ్ సైట్ కు బదులుగా బీమా మధ్యవర్తి దారికి మళ్లిస్తున్నట్లు IRDAI గుర్తించింది. రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన తర్వాత, ఆన్‌లైన్ బీమా పంపిణీని కొనసాగిస్తున్నట్లు IRDAI పేర్కొంది. పాలసీదారులకు మద్దతు ఇవ్వడానికి తగినంత శిక్షణ పొందిన సిబ్బంది కూడా కంపెనీలో లేరని తెలుసుకుంది.